News March 8, 2025

మహబూబాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్

image

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రజలకు ఒక శుభవార్త. పట్టణ కేంద్రంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న రైల్వే మూడో లైన్ మరమ్మతుల నిమిత్తం RUB582B అండర్ బ్రిడ్జ్‌ను మూసివేసిన విషయం తెలిసింది. తాజాగా మరమ్మతులు పూర్తయ్యాయని, ఈనెల 11వ తేదీన అండర్ బ్రిడ్జ్ రీ ఓపెన్ చేస్తున్నట్లుగా రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు.

Similar News

News March 20, 2025

రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు

image

ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 22, 23న రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది.

News March 20, 2025

టేకులపల్లి: బాలికపై అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం సంపత్ నగర్ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల హాస్టల్ డిప్యూటీ వార్డెన్ ప్రతాప్ సింగ్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు, యువకులు దేహశుద్ధి చేశారు. అనంతరం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు.

News March 20, 2025

భువనగిరి: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు..

image

జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన కెమిస్ట్రీ, వాణిజ్య శాస్త్రం పరీక్షలకు 6,395 మంది విద్యార్థులకు గాను 6,035 మంది హాజరయ్యారు. 360 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. హాస్టళ్లు, అద్దె ఇళ్లలో ఉంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు బాటపట్టారు. దీంతో భువనగిరి ఆర్టీసీ బస్టాండ్ రద్దీగా కనిపించింది.

error: Content is protected !!