News February 13, 2025
మహబూబాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వల్లబు వెంకటేశ్వర్లు

మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కేసముద్రం పట్టణానికి చెందిన వల్లభు వెంకటేశ్వర్లును ఎన్నుకున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ, అనుబంధ సంస్థలలో పనిచేసిన ఆయన సుదీర్ఘ అనుభవంతో పార్టీని బలోపేతం చేసినందుకు గాను వెంకటేశ్వర్లును నియమించినట్లు తెలిపారు.
Similar News
News December 5, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

NH 161పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అల్లాదుర్గ్ కాయిదంపల్లి పెద్దమ్మ ఆలయం వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ట్రాక్టర్.. కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిజాంపేట్ మండలం మునిగేపల్లికి చెందిన కారు డ్రైవర్ సోయల్(25) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సిన సోయల్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
News December 5, 2025
ఇవి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయ్..

మన ఆహార వ్యవస్థలకు పునాది భూమి. అయితే ప్లాస్టిక్ వినియోగం, అడవుల నరికివేత, రసాయన పరిశ్రమల వ్యర్థాలు, మిరిమీరిన పురుగు మందులు, రసాయన ఎరువుల వినియోగం, లోతు దుక్కులు, తీర ప్రాంతాల్లో సముద్రమట్టం పెరుగుదల, వరదలు, గాలి, తుఫానులతో నేల కోతకు గురవ్వడం వల్ల భూసారం దెబ్బతిని, పంట దిగుబడి, ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీటి కట్టడికి మన వంతు ప్రయత్నం చేసి నేల సారం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
News December 5, 2025
HNK: సబ్ పోస్ట్ ఆఫీసులకు మంగళం

కనీస ట్రాన్సాక్షన్స్ జరగకపోవడంతో హనుమకొండ నగరంలోని 3 సబ్ పోస్టాఫీసులను తరలిస్తున్నారు. హనుమకొండ డివిజన్ పరిధిలోని లష్కర్ బజార్, నయూంనగర్, బాపూజీ నగర్ సబ్ ఆఫీసులను రద్దు చేసి వాటిని ఇతర జిల్లాలకు కేటాయించారు. ఇప్పటికే ట్రాన్సాక్షన్స్ లేని కారణంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్కు మంగళం పాడారు. తాజాగా 3 సబ్ ఆఫీసులు రద్దు కాగా.. త్వరలోనే హనుమకొండలోని మరో రెండు సబ్ పోస్టాఫీసులు రద్దు కానున్నాయి.


