News March 23, 2025
మహబూబాబాద్: బెట్టింగ్ భూతం.. తీస్తుంది ప్రాణం!

ఐపీఎల్ మొదలు కావడంతో ఇప్పుడు అందరి నోటా బెట్టింగ్ మాటే. ఆటను అస్వాదించే వాళ్లు కొందరైతే, వ్యసనమై బెట్టింగ్లో రూ.లక్షల్లో నష్టపోయి SUICIDE చేసుకునే వాళ్లు కోకొల్లలు.ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా పోలీసులు బెట్టింగ్లపై నిఘా పెట్టారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించాల్సిన బాధ్యత ఉందన్నారు.
Similar News
News November 4, 2025
‘Admin123’.. అంతా కొట్టేశాడు!!

గుజరాత్ హ్యాకర్ పరిత్ ధమేలియా 2024లో ఢిల్లీ, నాసిక్, ముంబై తదితర నగరాల్లో 50K CCTV క్లిప్స్ తస్కరించాడు. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లోని ఈ క్లిప్స్ పోర్న్ మార్కెట్లో అమ్మేశాడు. మొదట రాజ్కోట్ పాయల్ ఆస్పత్రిలో గైనకాలజీ టెస్ట్స్ ఫుటేజ్ కోసం CCTV హ్యాక్ చేస్తే పాస్వర్డ్ Admin123 అని తెలిసింది. ఇదే పాస్వర్డ్తో ఇతర నగరాల్లోనూ హ్యాక్ చేశాడు. ఈ Febలో అరెస్టైన పరిత్ నేర వివరాలు తాజాగా బయటకొచ్చాయి.
News November 4, 2025
జీలుగుమిల్లి: ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి

జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెంలో మంగళవారం ఉదయం ట్రాక్టర్ అదుపుతప్పి అఖిల్ (22) మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీలుగుమిల్లి ఎస్.ఐ వి. క్రాంతికుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 4, 2025
చిత్తూరు: దరఖాస్తులతో రూ.10 లక్షల ఆదాయం

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని 56 పోస్టులకు గత నెల నోటిఫికేషన్ ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 2,093 దరఖాస్తులు వచ్చినట్లు చిత్తూరు DMHO సుధారాణి తెలిపారు. దరఖాస్తుల ఫీజుతో తమ శాఖకు రూ.10.46 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.


