News February 2, 2025

మహబూబాబాద్: మహిళపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్

image

లైగింక దాడి కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తొర్రూరు సీఐ, ఎస్ఐ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం తొర్రూరుకి వలస వచ్చారు. ఈక్రమంలో నెల్లికుదురు మండలం హనుమాన్‌నగర్‌తండాకు చెందిన దేశిలావ్ JAN 29న మహిళపై లైగింక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మరో బాలికపై లైంగిక దాడికి యత్నించిన కాంస్యతండా వాసి బానోత్‌ అజయ్‌పై పొక్సో కేసు నమోదవ్వడంతో అరెస్ట్ చేశారు.

Similar News

News November 24, 2025

నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం

image

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర ఆరోగ్యం విషమించింది. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఈక్రమంలోనే అంబులెన్స్ ఆయన ఇంటికి చేరుకుంది. అటు బంధువులు, బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్ర ఇంటికి వెళ్తున్నారు.

News November 24, 2025

నిరంజన్ నీ తాటతీస్తా.. ఒళ్లు జాగ్రత్త: కవిత

image

TG: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి చీఫ్ కవిత ఫైరయ్యారు. ఆయన అవినీతి వల్లే వనపర్తిలో BRSకు కోలుకోలేని దెబ్బపడిందని దుయ్యబట్టారు. 3, 4 ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారని విమర్శించారు. MRO ఆఫీసును తగలబెడితే ఎదురుతిరిగిన 32 మందిని జైలుకు పంపారన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఓడించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. ‘నాగురించి ఇంకోసారి మాట్లాడితే నీ తాటతీస్తా. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో’ అని హెచ్చరించారు.

News November 24, 2025

తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

image

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.