News February 2, 2025
మహబూబాబాద్: మహిళపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్

లైంగిక దాడి కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తొర్రూరు సీఐ, ఎస్ఐ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం తొర్రూరుకి వలస వచ్చారు. ఈక్రమంలో నెల్లికుదురు మండలం హనుమాన్‌నగర్‌తండాకు చెందిన దేశిలావ్ JAN 29న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మరో బాలికపై లైంగిక దాడికి యత్నించిన కాంస్యతండా వాసి బానోత్ అజయ్‌పై పొక్సో కేసు నమోదవ్వడంతో అరెస్ట్ చేశారు.
Similar News
News February 18, 2025
నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ: బల్దియా కమిషనర్

భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ చేస్తామని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే స్పష్టం చేశారు. నూతన భవనాల నిర్మాణాలకు అనుమతుల మంజూరు బడా భవన నిర్మాణాలకు ఆక్యుపెన్సీని సర్టిఫికెట్ల జారీకి కమిషనర్ నగర పరిధిలోని సుబేదారి ప్రాంతంలోని పోస్టల్ కాలనీ ప్రకాశ్ రెడ్డి పేట ప్రాంతంలో గల లోటస్ కాలనీ ఖాజీపేట ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నమోదు చేసిన వివరాలను కొలతలు వేసి పరిశీలించారు.
News February 18, 2025
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని WGL కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలెక్టర్ కలసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
News February 17, 2025
స్కూలు విద్యార్థులకు కంటి పరీక్షలు: డీఎంహెచ్వో

వరంగల్ జిల్లాలో 36,368 మంది విద్యార్థులు ఉండగా అందులో 33,516 మందికి కంటి పరీక్షలు 92.36% నిర్వహించినట్లు డీఎంహెచ్వో సాంబశివరావు తెలిపారు. అందులో నుంచి 1074 మంది కంటి దృష్టి లోపాలతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించామన్నారు. వారికి నేత్ర వైద్యులతో పరీక్షలు చేస్తూ ఆన్‌లైన్లో స్టేట్‌కి పంపించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమము నేటి నుంచి మార్చ్ 3 వరకు పూర్తి చేయాలన్నారు.