News February 2, 2025

మహబూబాబాద్: మహిళపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్

image

లైంగిక దాడి కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తొర్రూరు సీఐ, ఎస్ఐ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం తొర్రూరుకి వలస వచ్చారు. ఈక్రమంలో నెల్లికుదురు మండలం హనుమాన్‌నగర్‌తండాకు చెందిన దేశిలావ్ JAN 29న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మరో బాలికపై లైంగిక దాడికి యత్నించిన కాంస్యతండా వాసి బానోత్‌ అజయ్‌పై పొక్సో కేసు నమోదవ్వడంతో అరెస్ట్ చేశారు.

Similar News

News February 25, 2026

HYD: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

image

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 1,75,271 మంది విద్యార్థులు 217 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాస్తారు. 1st ఇయర్‌లో 81,898 మంది, 2nd ఇయర్‌లో 93,373 మంది ఉన్నారు. మాస్ కాపీయింగ్‌ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు CC రూమ్‌కు అనుసంధానించారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.

News February 25, 2026

గుంటూరు వన్ స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

గుంటూరు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్, కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, సెక్యూరిటీ తదితర ఖాళీలున్నాయి. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు స్వశక్తి భవన్‌ను సంప్రదించాలన్నారు.

News February 25, 2026

గుంతకల్లు డివిజన్‌లో ఖాళీల భర్తీకి కసరత్తు

image

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్‌లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లిస్తామని చెప్పారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించాలని కోరారు.