News February 2, 2025
మహబూబాబాద్: మహిళపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్

లైగింక దాడి కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తొర్రూరు సీఐ, ఎస్ఐ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం తొర్రూరుకి వలస వచ్చారు. ఈక్రమంలో నెల్లికుదురు మండలం హనుమాన్‌నగర్‌తండాకు చెందిన దేశిలావ్ JAN 29న మహిళపై లైగింక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మరో బాలికపై లైంగిక దాడికి యత్నించిన కాంస్యతండా వాసి బానోత్ అజయ్‌పై పొక్సో కేసు నమోదవ్వడంతో అరెస్ట్ చేశారు.
Similar News
News February 19, 2025
నేడు ఏలూరు జిల్లాలో జర్మన్ ప్రతినిధుల పర్యటన

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించేందుకు జర్మన్ ప్రతినిధి బృందం ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించనుంది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ఏలూరు, కామవరపుకోట, ద్వారకాతిరుమల మండలాల్లో పర్యటిస్తారు. పంట పొలాలను పరిశీలిస్తారు. ఇక్కడి సాగు వివరాలను తెలుసుకుంటారు.
News February 19, 2025
ఖమ్మంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం క్రాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News February 19, 2025
NGKL: ప్రేమ పేరుతో మోసం.. బాలికకు 9 నెలల కొడుకు

ప్రేమ పేరుతో ఓ బాలికను మోసంచేసి తల్లిని చేసిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. భూత్పూర్ మం. కొత్తమూల్గరకు చెందిన ఎండీ జాఫర్(33) RTCలో అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఓ బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని నిలదీయగా.. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాలిక పోలీసులను నిన్న ఆశ్రయించింది. ప్రస్తుతం బాలికకు తొమ్మిదినెలల కుమారుడు ఉన్నాడు.