News April 4, 2025
మహబూబాబాద్: మాయదారి వానలు.. అప్పులే గతి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.
Similar News
News December 16, 2025
భార్య నల్లగా ఉందని..

AP: పల్నాడు(D) వినుకొండలో అమానవీయ ఘటన జరిగింది. భార్య నల్లగా ఉందని భర్త, అశుభాలు జరుగుతున్నాయంటూ అత్తమామలు వేధించారు. చివరికి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. లక్ష్మి, కోటేశ్వరరావులకు ఈ జూన్ 4న వివాహమైంది. ₹12L నగదు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇవ్వగా, ఆమె నల్లగా ఉందనే సాకుతో అదనపు కట్నం కోసం వేధించారు. తాజాగా గెంటేయడంతో భర్త ఇంటి ముందు లక్ష్మి ధర్నా చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
News December 16, 2025
నల్గొండలో పోలింగ్కు పటిష్ఠ భద్రత

నల్గొండ జిల్లాలో జరుగుతున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 1500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని హెచ్చరించారు. విజేతల ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించారు.
News December 16, 2025
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో రికార్డు

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్లకు పైగా నెట్వర్త్ సాధించిన తొలి వ్యక్తిగా నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 2026లో 800B డాలర్ల విలువతో స్పేస్-X ఐపీవోకు వస్తుండటంతో మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. అక్టోబర్లో 500B డాలర్ల మార్క్ను దాటిన మస్క్, కేవలం 2 నెలల్లోనే మరో 100B డాలర్లను సంపాదించారు. ప్రస్తుతం ఆయన నెట్వర్త్ సుమారు $677Bగా ఉంది.


