News March 20, 2025

మహబూబాబాద్ మార్కెట్‌కు పోటెత్తిన ఎర్రబంగారం

image

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి పోటెత్తింది. బుధవారం తేజ, తాలు రకం కలిపి 6,727 బస్తాల మిర్చి విక్రయాలు జరిగాయి. తేజ రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.13,639, కనిష్ఠ ధర రూ.9,500 తాలు రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,350, కనిష్ఠ ధర రూ.5,020 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News September 19, 2025

వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

image

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్‌, సికింద్రాబాద్‌, KPHB, ఉప్పల్‌, రిసాలాబజార్‌ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.  

News September 19, 2025

SRD: ‘ఇన్‌స్పైర్ నామినేషన్లు పూర్తి చేయండి’

image

జిల్లాలో ఇన్‌స్పైర్ నామినేషన్ చేయని పాఠశాలలు చేసే విధంగా రిసోర్స్ పర్సన్లు జిల్లా, డివిజన్, మండల రిసోర్స్ పర్సన్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 19, 20 రెండు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉన్నాయని సూచించారు. విద్యార్థులకు సంబంధించిన వివరాలన్నీ తీసుకొని దసరా సెలవుల్లోనూ నామినేషన్ చేయడానికి ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు.

News September 19, 2025

జగిత్యాల: ‘వెండికొండలా సోమన్న గుట్ట’

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమన్నగుట్ట వెండికొండలా మెరుస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు కొండ పైనుంచి నీటిధారలు కిందకి జాలువారుతూ పాలవలే తెల్లగా మెరిసిపోతున్న ఈ అద్భుత దృశ్యం తాజాగా కెమెరాకు చిక్కింది. గుట్ట వెనుక భాగం నుంచి తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.