News March 10, 2025
మహబూబాబాద్: మార్చి 20 వరకు దరఖాస్తుల పొడగింపు

తెలంగాణ రాష్ట్రం మోడల్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణను పొడిగించింది. మార్చి20 వరకు పొడిగించినట్లు అనంతారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉపేందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం 7-10 తరగతులలో మిగిలిన సీట్ల కోసం మార్చి 20 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
TODAY TOP STORIES

* చొరబాటుదారులను కాపాడే పనుల్లో RJD, కాంగ్రెస్ బిజీ: మోదీ
* బిహార్లో ముగిసిన తొలి విడత పోలింగ్.. 64.66% ఓటింగ్ నమోదు
* డిజిలాకర్లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: CM CBN
* చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్
* BRS ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: CM రేవంత్
* రేవంత్కు రోషముంటే KTRను జైల్లో పెట్టాలి: బండి సంజయ్
* T20లో ఆసీస్పై భారత్ విక్టరీ.. సిరీస్లో 2-1 లీడ్
News November 7, 2025
పొగాకు రైతులకు న్యాయం చేద్దాం: కలెక్టర్

ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి బాపట్ల కలెక్టరేట్ వద్ద మార్కుఫెడ్ డిఎం, పొగాకు ఫ్యాక్టరీల యాజమాన్యంతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని వివరించారు.
News November 7, 2025
మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.


