News January 24, 2025

మహబూబాబాద్: రేపటి నుంచి అండర్ బ్రిడ్జ్ మూసివేత

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జ్‌ను శనివారం నుంచి మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. మూడో రైల్వే లైన్ నిర్మాణం పనుల కోసం గాను జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 20 తేదీ వరకు మహబూబాబాద్ రైల్వే అండర్ బ్రిడ్జిని మూసివేయనున్నారు. అండర్ బ్రిడ్జి మూసివేయడం ద్వారా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.

Similar News

News December 1, 2025

WGL: గుర్తుల పంచాయితీ!

image

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.

News December 1, 2025

బాపట్ల: వీడియోలు చూపించి అత్యాచారంపై కేసు నమోదు

image

చీరాలకు చెందిన ఓ మహిళ తనను బెదిరించి అత్యాచారం చేశారని బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. టౌన్ పోలీసులు న్యాయవాది తులసీరావు, టీడీపీ మహిళా కార్యకర్త రజని సహా 8 మందిపై కేసు నమోదు చేశారు. వీడియోలు చూపించి బెదిరించి అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు టౌన్ సీఐ రాంబాబు తెలిపారు.

News December 1, 2025

ఉమ్మడి నల్గొండలో పార్టీ బలోపేతంపై BJP ఫోకస్..!

image

తెలంగాణలో బీజేపీ బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జిల్లాల ఇన్‌ఛార్జ్‌లను కొత్తగా నియమించారు. జిల్లాల వారీగా నాయకత్వ మార్పులు చేసి, గ్రౌండ్‌లో కార్యకర్తలతో అనుసంధానం, పంచాయతీ ఎన్నికల వేళ దూకుడు పెంచాలని పార్టీ భావిస్తోంది. నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉదయ్‌ను నియమించగా, సూర్యాపేటకు టీ.రమేశ్, యాదాద్రి భువనగిరికి శ్రీనివాసరెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.