News January 24, 2025
మహబూబాబాద్: రేపటి నుంచి అండర్ బ్రిడ్జ్ మూసివేత

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జ్‌ను శనివారం నుంచి మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. మూడో రైల్వే లైన్ నిర్మాణం పనుల కోసం గాను జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 20 తేదీ వరకు మహబూబాబాద్ రైల్వే అండర్ బ్రిడ్జిని మూసివేయనున్నారు. అండర్ బ్రిడ్జి మూసివేయడం ద్వారా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.
Similar News
News February 10, 2025
వీరు త్వరగా ముసలోళ్లు కారు?

అన్ని రక్త వర్గాల్లో కంటే B బ్లడ్ గ్రూప్ వారు నెమ్మదిగా వృద్ధాప్యం పొందుతారని ప్లానెట్ టుడే సర్వే తెలిపింది. మిగతా గ్రూపులతో పోల్చుకుంటే ఈ గ్రూప్ వారు నెమ్మదిగా ముసలోళ్లుగా మారతారని పేర్కొంది. వీరి రక్తంలో కణాల పునరుత్పత్తి, కణజాల మరమ్మతులు మెరుగ్గా ఉండటం వల్ల యవ్వనంగా కనిపిస్తారని తెలిపింది. అలాగే వీరికి సుదీర్ఘ ఆయుర్దాయం కూడా ఉంటుందని వెల్లడించింది.
News February 10, 2025
రేపు మహా కుంభమేళాకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్ రాజ్‌లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
News February 9, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ప్రజావాణి కార్యక్రమం వాయిదా
> జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటిన స్టేషన్ ఘనపూర్ విద్యార్థులు
> షెడ్యూల్ కులాల రిజర్వేషన్ పెంచాలి: కడియం
> తప్పుడుగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని NSUI నేతల డిమాండ్
> ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
> సోమేశ్వరాలయానికి అరకిలో వెండి పూర్ణకుంభం అందజేత