News February 17, 2025
మహబూబాబాద్: రేపు జిల్లా వ్యాప్తంగా సీపీఐ నిరసనలు: విజయ్ సారథి

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని మండల కేంద్రాల్లో సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి విజయ సారధి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించకుండా తాత్సారం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో అమలు చేయడంలేదన్నారు.అందుకు రేపు జిల్లాలో నిరసనలు చేపడుతున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిరసనలో పాల్గొనాలన్నారు.
Similar News
News February 24, 2026
కాసేపట్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2-3 గంటల్లో గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రాత్రంతా హైదరాబాద్‌లో <<19222449>>భారీ వర్షం<<>> కురిసిన విషయం తెలిసిందే.
News February 24, 2026
నేడు నాగర్‌కర్నూల్‌లో టెన్షన్.. టెన్షన్..!

కుమ్మెర ఘటన నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే BRS, CPM, BSP, TRP, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ, MRPS, బీసీ సంఘాల నేతలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. అయితే 8 మంది నిందితుల్లో ముగ్గురినే పోలీసులు అరెస్ట్ చేశారని వారంటున్నారు. కాగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నిన్న కాంగ్రెస్ జిల్లా చీఫ్, MLA వంశీకృష్ణ తెలిపారు. నేడు BJP స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు NGKLకు రానుండగా టెన్షన్ నెలకొంది.
News February 24, 2026
ఐఐసీటీలో 16 పోస్టులకు ఇంటర్వ్యూ

<


