News March 23, 2025

మహబూబాబాద్: రైతులకు కీలక సూచన

image

రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై దృష్టి సారించాలని మల్యాల కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ ఎస్ మాలతి సూచించారు. ఈ నెల 19 నుంచి 22 తేదీ వరకు పేరటి కోళ్ల పెంపకంపై కేవీకేలో యువ రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికంగా పౌల్ట్రీ రైతులు పాల్గొనడం జరిగిందని, వారికి కోళ్ల పెంపకం, దాణా, రోగాలు, వ్యాక్సిన్‌ల గురించి అవగాహన కల్పించారు.

Similar News

News April 18, 2025

రవితేజ మేనల్లుడి సినిమాలో నటించిన ఆదిలాబాద్ యువకుడు

image

హీరో ర‌వితేజ మేన‌ల్లుడు అవినాష్ వ‌ర్మ హీరోగా జ‌గ‌మెరిగిన స‌త్యం పేరుతో చిత్రీకరించిన MOVIE నేడు విడుదలైంది. మూవీలో అవినాష్ వర్మకు జోడీగా ఆద్య రెడ్డి, నీలిమ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఈ మూవీతో తిరుప‌తి పాలే డైరెక్ట‌ర్‌గా తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం అవుతోన్నారు. కాగా ఈ సినిమాలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నిహల్ రాజ్ పుత్ నటించాడు. ఖైదీ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News April 18, 2025

గుంటూరు: పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు నమోదు

image

గుంటూరులో ఓ యూట్యూబర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన యువతికి మార్చి 10న నల్లచెరువు 2వ లైనుకు చెందిన కైలాశ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 18న పెళ్లి జరగాల్సి ఉండగా, వరుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, చేసుకోను అంటూ వెనక్కి తగ్గాడు. మధ్యలో పెద్దలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో బాధిత యువతి లాలాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 18, 2025

మన ‘ఓరుగల్లు’లో ఎన్నో చారిత్రక కట్టడాలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వేయి స్తంభాల గుడి, కాకతీయ కళా తోరణం, ఖిలా వరంగల్, కోటలు, పలు గ్రామాల్లో వారు నిర్మించిన శివాలయాలు, ఇతర దేవాలయాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాగా, నేడు అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం.

error: Content is protected !!