News May 11, 2024
మహబూబాబాద్: రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ఉన్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణించిన బాలుడు పెద్దవంగర మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన చింతం జస్వంత్గా గుర్తించారు.
Similar News
News January 20, 2025
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి చిరుధాన్యాలు సోమవారం తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు రూ.6310 ధర పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4450 పలికింది. అలాగే కందులు రూ.7,100 పలికినట్లు వ్యాపారస్తులు తెలిపారు. చలికాలం నేపథ్యంలో రైతులు తేమ లేని నాణ్యమైన సరుకులు మార్కెట్కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
News January 20, 2025
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలి: కలెక్టర్ ప్రావీణ్య
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేజీబీవీ నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వంట సామగ్రిని భద్రపరిచిన స్టోర్ రూమును పరిశీలించారు.
News January 20, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా కొత్త తేజ మిర్చి ధర రూ.14,700 ధర పలకగా.. 341 రకం మిర్చికి రూ.15,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్ మిర్చికి రూ.12,700 ధర పలికిందని రైతులు చెబుతున్నారు.