News May 11, 2024
మహబూబాబాద్: రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ఉన్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణించిన బాలుడు పెద్దవంగర మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన చింతం జస్వంత్‌గా గుర్తించారు.
Similar News
News February 14, 2025
వరంగల్: WOW.. ప్రేమ పెళ్లి.. ఇద్దరికీ ఉపాధ్యాయ కొలువులు!

ప్రేమించుకున్న ప్రతి జంట పెళ్లి పీటలెక్కడం చాలా అరుదు. పెద్దలు ఒప్పుకోకపోవడం, ఇతర కారణాలతో విడిపోయినవారినే ఎక్కువగా చూస్తుంటాం. కానీ, వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన వినయ్, నాగలక్ష్మిలు ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులుగా ఉన్న వీరు.. 2019లో వివాహం చేసుకున్నారు. అంతేకాదు, 2024 డీఎస్సీలో ఇద్దరు ఉపాధ్యాయ కొలువులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
News February 14, 2025
వరంగల్: మిర్చి రైతన్నలకు సైతం నిరాశ.. తగ్గిన ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు తగ్గాయి.
> క్వింటా తేజ మిర్చి ధర గురువారం రూ.14,000 పలకగా.. నేడు రూ.13,600కి చేరింది.
> 341 మిర్చికి నిన్న రూ.13,500 ధర రాగా.. ఈరోజు రూ.13,600 అయింది.
> వండర్ హాట్(WH) మిర్చికి గురువారం రూ.16వేల ధర రాగా.. ఈరోజు భారీగా రూ. 500 తగ్గి రూ.15,500కి పడిపోయింది.
News February 14, 2025
వరంగల్: రైతన్నకు తీవ్ర నిరాశ.. భారీగా పడిపోయిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈవారం మొదటి నుంచి పత్తి ధరలు భారీగా పడిపోతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. బుధవారం రూ.6,950, గురువారం రూ.6,900కి పడిపోయింది. నేడు ఇంకా పతనమై రూ.6820కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే రూ.240 ధర తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.