News April 5, 2025

మహబూబాబాద్ వాసులూ.. APPLY చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను మహబూబాబాద్ జిల్లాలోని మీ MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News November 7, 2025

వనపర్తి: రేపు కలెక్టరేట్‌లో సామూహిక వందేమాతరం గేయాలాపన

image

వనపర్తి కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గేయం రచించి 150 సం.లు పూర్తి అయిన సందర్భంగా ప్రతిఒక్కరూ గేయాలాపన చేయాలని సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వందేమాతరం గేయాలాపన చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

News November 7, 2025

గోదావరిఖని: త్వరలో 473 మందికి కారుణ్య ఉత్తర్వులు

image

సింగరేణిలో మెడికల్‌ పూర్తి చేసి ఇప్పటి వరకు కారుణ్య నియామక పత్రాలు పొందని దాదాపు 473 మంది అభ్యర్థులకు ఈనెల 12న కొత్తగూడెం వేదికగా నియామక పత్రాలు అందజేస్తామని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చేతుల మీదుగా అందజేస్తారని తెలిపారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వంపై తాము తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఇది జరుగనుందని తెలిపారు.

News November 7, 2025

బాల్య వివాహాలను నిషేధించడం ప్రతి ఒక్కరి బాధ్యత: పెద్దపల్లి కలెక్టర్

image

బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లో “బేటి బచావో బేటి పడావో” కార్యక్రమంలో బాల్య వివాహాల నిరోధన పోస్టర్‌ను ఆవిష్కరించారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధం, వయసు 18 కంటే తక్కువ ఉన్న అమ్మాయిలకు మానసిక, శారీరక, ఆర్థిక నష్టాలు కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.