News March 7, 2025
మహబూబాబాద్: విషాదం.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జలగం అన్వేశ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు CI రవికుమార్ ఈరోజు తెలిపారు.కొంతకాలంగా అన్వేశ్ మద్యానికి బానిసవగా తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అతడు ఉరేసుకుని చనిపోయాడని తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News March 20, 2025
టెన్త్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్ల బంద్ చేయాలి: వరంగల్ సీపీ

పదో తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండవద్దని సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్ల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ముఖ్యంగా పరీక్ష కేంద్ర పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
News March 20, 2025
మంచిర్యాల జిల్లాలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

మంచిర్యాల జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. వచ్చే నాలుగు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు ఉపశమనం పొందనున్నారు. కానీ పంటలకు నష్టం జరిగే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News March 20, 2025
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్ సరఫరా, పంటల విస్తీర్ణం తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. చెరువులు, కుంటలు కబ్జా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.