News June 15, 2024
మహబూబాబాద్: 22న HCA టాలెంట్ హంట్
ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ నిర్వహిస్తోందని మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఛార్జి అజయ్ సారథి ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు నేటి నుంచి తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News September 21, 2024
క్యాబినెట్‌కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క
ఏటూరునాగారం కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ములుగు మెడికల్ కాలేజీకి పోస్టులు మంజూరుకు క్యాబినెట్ సంపూర్ణ ఆమోదం తెలిపింది. ఈ మేరకు క్యాబినెట్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఏటూరునాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అవడం వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
News September 21, 2024
ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ: మంత్రి కొండా
అణచివేతపై ధిక్కార స్వరం, ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సెప్టెంబర్ 21న కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన త్యాగ నిరతిని మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందని మంత్రి అన్నారు.
News September 21, 2024
అక్టోబర్ 3 నుంచి 13 వరకు భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు
శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి దేవి శరన్నవరాత్రి(దసరా) మహోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శేషు భారతి తెలిపారు. అక్టోబర్ 12 విజయదశమి దసరా సందర్భంగా భద్రకాళి తటాకంలో హంస వాహన తెప్పోత్సవం, అక్టోబర్ 13 శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.