News July 31, 2024
మహబూబ్నగర్లో కన్నీటి ఘటన..!

పేదరికం కన్నతల్లి పేగు బంధాన్ని దూరం చేసింది. ఈ విషాద ఘటన MBNR శిశు గృహంలో జరిగింది. MBNRకు చెందిన లింగం, రేణుక దంపతులు. వీరు దినసరి కూలీలు కాగా వీరికి ముగ్గురు పిల్లలు. అయితే భర్త అనారోగ్యంతో ఏడాది క్రితం మరణించాడు. 11 నెలల మూడో కూతురికి పాలు తాగించేందుకు డబ్బులు లేకపోవడంతో రేణుక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పాపను సాకలేక మంగళవారం శిశుగృహంలో వదిలిపెట్టి కన్నీరు కారుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Similar News
News December 12, 2025
రాజాపూర్: MLA అహంకారానికి హెచ్చరిక: ఎంపీ

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలుకావడం ఆయన అహంకారానికి ప్రజలు ఓటుద్వారా చేసిన హెచ్చరిక అని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డిగూడెంలో సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఆనంద్ రేవతిని ఎంపీ అభినందిస్తూ, శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషిచేయాలని సూచించారు. తన పూర్తి సహకారం ఉంటుందని డీకే అరుణ హామీ ఇచ్చారు.
News December 12, 2025
MBNR: వాహనదారులు, ప్రజలకు భద్రతా సూచనలు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లాలో శీతాకాలం తీవ్రం కావడంతో రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా ఏర్పడుతోంది. దీంతో విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఉదయం 5 నుంచి 8, రాత్రి 8 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు, వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
News December 12, 2025
MBNR : భూత్పూర్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.


