News March 20, 2025
మహబూబ్‌నగర్‌లో కానిస్టేబుల్ సూసైడ్

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News November 26, 2025
సేంద్రియ పెంపకం యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్

సేంద్రియ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం పాల్వంచ కొత్తూరులోని చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపకం యూనిట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ పద్ధతులు, పరిశుభ్రత ప్రమాణాలు, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ విధానాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.
News November 26, 2025
బిడ్డకు జన్మనిచ్చిన ‘బ్లూడ్రమ్’ ముస్కాన్.. DNA టెస్టుకు డిమాండ్

UP మీరట్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపి బ్లూడ్రమ్‌లో పాతేసిన <<16560833>>ముస్కాన్<<>> తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త సౌరభ్ పుట్టినరోజునే(NOV 24) బిడ్డ పుట్టడం గమనార్హం. దీంతో ఆ చిన్నారికి DNA టెస్టు నిర్వహించాలంటూ మృతుడి సోదరుడు రాహుల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెద్ద కూతురు విషయంలోనూ అతను పిల్ వేయగా తీర్పు వెలువడలేదు. వారిద్దరూ సౌరభ్ పిల్లలుగా తేలితే తామే పోషిస్తామని అతను చెబుతున్నాడు.
News November 26, 2025
ఉర్విల్ ఊచకోత.. 10 సిక్సులు, 12 ఫోర్లతో..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ కెప్టెన్ ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించారు. 31 బంతుల్లోనే శతకం బాదారు. మొత్తంగా 37 బంతుల్లో 10 సిక్సులు, 12 ఫోర్లతో 119* రన్స్ చేశారు. తొలుత సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 182/9 స్కోర్ చేయగా, ఉర్విల్ ఊచకోతతో గుజరాత్ 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా T20లలో ఫాస్టెస్ట్ సెంచరీ ఉర్విల్ పేరుమీదనే ఉంది. 2024లో త్రిపురపై 28 బాల్స్‌లోనే శతకం చేశారు.


