News March 20, 2025

మహబూబ్‌నగర్‌లో కానిస్టేబుల్ సూసైడ్

image

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News October 13, 2025

కెంటన్ మిల్లర్ అవార్డు సాధించిన మొదటి భారత మహిళ

image

కజిరంగా నేషనల్‌ పార్క్‌ మొదటి మహిళా ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న సొనాలి ఘోష్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా ప్రపంచంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటైన IUCN కెంటన్ మిల్లర్ అవార్డును పొందారు. వణ్యప్రాణుల సంరక్షణకు గానూ ఆమెకు ఈ అవార్డు వచ్చింది. పూణేలో జన్మించిన సొనాలి వైల్డ్‌లైఫ్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ లా చదివారు. పులులను ట్రాక్‌ చేసే రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీపై పరిశోధించి డాక్టరేట్‌ పొందారు.

News October 13, 2025

జీఎస్టీ 2.0 తో ప్రజలకు ఊరట: కలెక్టర్

image

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు కలెక్టర్ కీర్తి చేకూరి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకు ఊరట లభిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తెచ్చిందని వివరించారు.

News October 13, 2025

మందమర్రి: ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

image

మందమర్రి సింగరేణి ఏరియా కేకే ఓపెన్ కాస్ట్ గనిని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ప్రాజెక్ట్ స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓబీ ప్లాంట్ వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. మైనింగ్ కార్యకలాపాలను వీక్షించారు. కృషి పట్టుదలతో ఏదైనా సాధ్యమని, విజయాన్ని ఉద్యోగులు, కార్మికులు ప్రేరణ తీసుకోవాలన్నారు.