News March 20, 2025

మహబూబ్‌నగర్‌లో కానిస్టేబుల్ సూసైడ్

image

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News November 3, 2025

మైక్రో చీటింగ్‌తో కాపురాల్లో చిచ్చు

image

భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా.. చిన్నచిన్న తప్పులు చేస్తుండటమే.. ‘మైక్రో చీటింగ్‌’. ఇది అక్రమ సంబంధం అంత స్పష్టంగా ఉండదు. ఇందులో చాలామందికి చెడు ఉద్దేశాలూ ఉండవని అంటున్నారు నిపుణులు. కానీ చిన్నచిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతిని దీర్ఘకాలంలో విడాకులకూ దారితీస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఇద్దరూ కలిసి చర్చించుకుంటే.. సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.

News November 3, 2025

SRCL: పెద్దింటి అశోక్‌ కుమార్‌కు జీవన సాఫల్య పురస్కారం

image

సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సినీ గేయ రచయిత అయిన పెద్దింటి అశోక్‌ కుమార్‌కు ‘అమృత లత జీవన సాఫల్య పురస్కారం-2025’ లభించింది. నిజామాబాద్‌లోని అపురూప అవార్డు బృందం వారు ఆదివారం ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఆయన సాహిత్యంపై ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీల నుంచి ఐదు ఎంఫిల్, నాలుగు పీహెచ్‌డీ పట్టాలు రావడం విశేషం.

News November 3, 2025

సీఏ ఫలితాలు విడుదల

image

సీఏ(ఛార్టర్డ్ అకౌంటెన్సీ)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ రిజల్ట్స్ ICAI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: <>https://icai.nic.in/caresult/<<>>