News April 17, 2025
మహబూబ్‌నగర్‌లో దారుణ ఘటన

ఆస్తి కోసం తండ్రి మృతదేహానికి కన్న కొడుకు తలకొరివి పెట్టకపోవడంతో చివరకు చిన్న కూతురు పెట్టింది. ఈ ఘటన MBNR పద్మావతి కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీ వాసి మాణిక్యరావు మృతిచెందారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు జరుగుతుండగా తలకొరివి పెట్టాల్సిన కుమారుడు రూ.కోటి విలువ చేసే ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తలకొరివి పెడతానన్నాడు. చివరకు బంధువుల సూచనతో చిన్నకూతురు తలకొరివి పెట్టింది.
Similar News
News April 20, 2025
నెల్లూరు: హెల్త్ ఆఫీసర్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ చైతన్య ఆదివారం బుల్లెట్ వాహనంపై పర్యటించి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. ధనలక్ష్మిపురం, నారాయణ మెడికల్ కాలేజ్ రోడ్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. మస్టర్లను పరిశీలించి శానిటేషన్ సెక్రటరీలకు సూచనలు చేశారు. కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఆదివారం కూడా పనికి వచ్చే కార్మికుల సంఖ్య తగ్గకుండా చూడాలని ఆదేశించారు.
News April 20, 2025
పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి సీతక్క

ఉట్నూర్ మండలం దేవుగూడ ప్రభుత్వ గిరిజన టీడబ్ల్యూపీఎస్ పాఠశాలలో ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క శిశు బెంచెస్ అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే అన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా పాల్గొన్నారు.
News April 20, 2025
గోవిందరావుపేట: భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ టిఎస్ దివాకర్ అన్నారు. గోవిందరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాతే సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడతామన్నారు. అధికారులు గ్రామాల వారిగా సదస్సులు ఏర్పాటు చేస్తారని తెలిపారు.