News April 6, 2025
మహబూబ్నగర్లో నేడు చికెన్, మటన్ షాపులు బంద్

శ్రీరామ నవమిని పురస్కరించుకుని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం చికెన్, మటన్, చేపలు తదితర మాంసం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ మహేశ్వర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా మున్సిపాలిటీ హెచ్చరికలను బేఖాతరు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. SHARE IT
Similar News
News November 18, 2025
MBNR: వాలీబాల్ ఎంపికలు.. 500 మంది హాజరు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. డీఈవో ప్రవీణ్ కుమార్, స్టేట్ ఎస్జీఎఫ్ సెక్రటరీ ఉషారాణి, జడ్చర్ల ఎంఈఓ మంజులా దేవి, SGF జిల్లా సెక్రటరీ డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పీడీలు వేణుగోపాల్, రామచందర్, రాములు, ముస్తఫా, కృష్ణ, మోహిన్, రవికుమార్ గౌడ్, శంకర్ పాల్గొన్నారు.
News November 18, 2025
MBNR: వేతనాలు అకౌంట్లో జమ:వీసీ

పాలమూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి యూనివర్సిటీ వీసీ జిఎన్ శ్రీనివాస్ గుడ్ న్యూస్ తెలిపారు. ఇవాళ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 3,4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ఐఎఫ్ఎమ్ఎస్, పిఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలను జరుగుతుందన్నారు. వేతనాలు వారి అకౌంట్లో జమ అయ్యే విధంగా ప్రయత్నించినారని తెలిపారు.
News November 18, 2025
జడ్చర్ల: అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.. వారి వివరాలు పప్పు (ఒడిశా) హరేందర్( బిహార్) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పప్పున్, సాతి మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


