News December 11, 2024

మహబూబ్‌నగర్‌లో మృతదేహం కలకలం

image

గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మెయిన్ గేట్ పక్కన రూం సమీపంలో ఓ వ్యక్తి చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుంది. అతడి రెండు చేతులు కొట్టేసి ఉన్నాయి. ఎవరైనా గుర్తిస్తే 8712659312, 8712659334 నంబర్లకు సమాచారం ఇవ్వాలని 2-టౌన్ ఎస్ఐ తెలిపారు. ఇది హత్యనా.. ప్రమాదమా తెలియాల్సి ఉంది.

Similar News

News January 20, 2025

NGKL: అర్హులందరికీ సంక్షేమ పథకాలు: అడిషనల్ కలెక్టర్

image

బిజినేపల్లి మండల కేంద్రంలోనీ తాహశీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ పి.అమరేందర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రైతు భరోసా సర్వే వివరాలను తహశీల్దార్ శ్రీరాములును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేవిధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కథలప్ప, ఏవో నీతీ, ఎంపీఓ నరసింహులు, మండల ఏఈవోలు పాల్గొన్నారు.

News January 20, 2025

MBNR: ప్రజలు QR కోడ్ స్కాన్లను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

image

పోలీస్ సేవల పై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఏర్పాటు చేసినా QR కోడ్ స్కాన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి ప్రజలకు సూచించారు. పోలీస్ సేవలగురించి తమ అభిప్రాయం తెలిపేందుకు QR కోడ్ స్టికర్లను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాలలో, డీఎస్పీ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయాలో అతికించామని తెలిపారు.

News January 20, 2025

MBNR: రైతు భరోసా వారికే: మంత్రి జూపల్లి

image

వ్యవసాయ యోగ్యమైన భూముల రైతులకే రైతు భరోసా లబ్ధి చేకూరుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం HYDలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు పథకంలో రూ.25 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామ సభ నిర్ణయాలే కీలకం అని చెప్పారు. గ్రామ సభలో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.