News March 20, 2025

మహబూబ్‌నగర్‌లో AR కానిస్టేబుల్ సూసైడ్

image

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News September 16, 2025

MBNR: విద్యుత్ స్తంభం ఇలాగే ఉండాలా..?

image

మహబూబ్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీలో ఓ ఇంటి ప్రహరీ గోడలో విద్యుత్ స్తంభం దర్శనమిస్తుంది. రెండు నెలల క్రితం ప్రచార మాధ్యమాలలో విషయం వైరల్ కావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ తొలగిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ అది అలాగే ఉండడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన ఉండాల్సిన విద్యుత్ స్తంభం ఇంటి ప్రహరీ గోడలోనే ఉండాలా..? అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

News September 15, 2025

MBNR: భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

image

ఎస్పీ డి.జానకి సోమవారం మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెచ్‌టీయూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

News September 15, 2025

MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.