News May 19, 2024

మహబూబ్‌నగర్: ‘అంతటా అదే చర్చ!!’

image

ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై అందరూ చర్చించుకుంటున్నారు. ఉదయం వేళలో మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు దీనిపైనే చర్చలు పెట్టారని స్థానికులు తెలిపారు. టీకొట్టు, హోటళ్లు, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు, ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై చర్చలు నడుస్తున్నాయి.

Similar News

News December 2, 2024

శ్రీశైల పశ్చిమ ద్వారం మన అలంపుర్

image

శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడి తుంగభద్ర నది తీరాన ఉన్నది. ఇక్కడ పురాతనమైన దేవాలయాలు, బాధమీ చాళుక్య శిల్పా సంపద, సంస్కృతిని సూచిస్తున్నాయి. ఆలయంలో ప్రధాన దేవుళ్లుగా బాల బాలబ్రహ్మేశ్వర , జోగులాంబ అమ్మవారు కొలువైన్నారు, మహాశక్తి పీఠాలలో ఒకటిగా, అష్ట దశ ఆలయ సమూహాల్లో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా, తీర్థ యాత్రల ప్రదేశంగా భక్తులను ఆకట్టుకుంటుంది.

News December 1, 2024

MBNR: లారీ ఢీకొని యువరైతు దుర్మరణం

image

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని వాడ్యాల గేటు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువరైతు దుర్మరణం చెందాడు. మండలంలోని దోనూరు గ్రామానికి చెందిన కుమార్ (24) స్పింక్లర్ పైపులు తీసుకొని వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 1, 2024

ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలి: MP మల్లు రవి

image

రిజర్వేషన్లపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మాలల సింహగర్జన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. మాల, మాదిగలు ఐక్యంగా ఉండి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకై ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, మాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.