News April 8, 2025

మహబూబ్‌నగర్: ఈ పురాతన బురుజు.. చరిత్ర తెలుసా..?

image

కాకతీయుల కాలంలోని సామంత రాజు గోన గన్నారెడ్డి సామ్రాజ్యంలోని రాజ్యశాల గ్రామాన్నే కాలక్రమేణ నేటి మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని రాచాలుగా పిలుస్తున్నారు. గ్రామం చుట్టూ 9కోట బురుజులు ఉండేవి. ప్రస్తుతం ఒకటే ఉండగా 6ఫీట్ల బేస్మెంట్ వెడల్పుతో తూర్పు పడమర 31ఫీట్లు, ఉత్తర దక్షిణం 31ఫీట్లు కొలతలతో 50ఫీట్ల ఎత్తుతో భారీగా ఉంటుంది. వీటితో శత్రువుల దాడుల నుంచి ప్రజలను కాపాడేవారని గ్రామస్థులు చెబుతున్నారు.

Similar News

News February 23, 2026

ఆర్ & బీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఆర్ & బీ శాఖ పనితీరుపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, నాన్‌ప్లాన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధులతో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఈ భావ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

News February 23, 2026

అనకాపల్లి: ఈనెల 28న మంత్రి లోకేశ్ రాక

image

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతంపాలెం గ్రామంలో ఈనెల 28వ తేదీన బ్లూ జెట్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వస్తున్నట్లు టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంత్రి లోకేశ్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

News February 23, 2026

ASF: పోలీస్ ప్రజావాణిలో 8 దరఖాస్తులు

image

ఆసిఫాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ASF జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 8 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని, వాటిపై తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.