News April 8, 2025

మహబూబ్‌నగర్: ఈ పురాతన బురుజు.. చరిత్ర తెలుసా..?

image

కాకతీయుల కాలంలోని సామంత రాజు గోన గన్నారెడ్డి సామ్రాజ్యంలోని రాజ్యశాల గ్రామాన్నే కాలక్రమేణ నేటి మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని రాచాలుగా పిలుస్తున్నారు. గ్రామం చుట్టూ 9కోట బురుజులు ఉండేవి. ప్రస్తుతం ఒకటే ఉండగా 6ఫీట్ల బేస్మెంట్ వెడల్పుతో తూర్పు పడమర 31ఫీట్లు, ఉత్తర దక్షిణం 31ఫీట్లు కొలతలతో 50ఫీట్ల ఎత్తుతో భారీగా ఉంటుంది. వీటితో శత్రువుల దాడుల నుంచి ప్రజలను కాపాడేవారని గ్రామస్థులు చెబుతున్నారు.

Similar News

News April 19, 2025

JEE మెయిన్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు ఎవరంటే?

image

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో 24 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్ రాగా, వారిలో నలుగురు తెలుగువారు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హర్ష గుప్తాకు 8, అజయ్ రెడ్డికి 16(ఆలిండియా ఈడబ్ల్యూఎస్ కోటా మొదటి ర్యాంక్), బనిబ్రత మజీకి 24వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఏపీకి చెందిన సాయి మనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంకుతో పాటు బాలికల్లో 2వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.

News April 19, 2025

సిద్దిపేట: మిత్రులతో ఆడుతుండగా బాలుడి మృతి

image

కరెంట్ షాక్ తగిలి <<16142215>>విద్యార్ధి మృతి<<>> చెందిన ఘటన తోగుట(M)లో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. తుక్కాపూర్‌‌కు చెందిన చికుడ్క స్వామి గురువారం రాత్రి తన ఇద్దరి కుమారులతో కలిసి ఆలయం వద్దకు వెళ్లారు. గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ నిర్వహించేందుకు విద్యుత్ డెకరేషన్ ఏర్పాటు చేశారు. ఆ వైరు ఇనుప పైపునకు తగిలిఉంది. ప్రణీత్ ఆడుకుంటూ ఇనుప పైపునకు తగలడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

News April 19, 2025

మెదక్: అగ్నివీర్‌ దరఖాస్తులు

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యువకుల నుంచి అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రాబాద్‌లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT

error: Content is protected !!