News June 19, 2024

మహబూబ్‌నగర్ ఎస్పీకి ఘన వీడ్కోలు

image

మహబూబ్‌నగర్ ఎస్పీ హర్షవర్ధన్‌కి జిల్లా పోలీస్ సిబ్బంది బుధవారం ఘనంగా వేడుకలు పలికారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హల్ నందు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 8నెలల కాలంలో సిబ్బంది సహకారంతో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఘనత హోంగార్డు దగ్గర నుంచి ఎస్పీ వరకు అందరికీ దక్కుతుందన్నారు.

Similar News

News December 5, 2025

MBNR: సీఎంకు కాంగ్రెస్ కార్యకర్త లేఖ..మూడు ముక్కలైందంటూ ఆవేదన

image

సీఎం సార్ కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలైందని, గ్రామంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత BRS పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే వార్డు అభ్యర్థులను కేటాయించారని MBNR(D) గండీడ్(M) పెద్దవార్వాల్‌కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లెటర్ వైరల్ అయింది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశామని, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీని కాపాడాలన్నారు.

News December 5, 2025

MBNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల నామినేషన్ల జోరు

image

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండో రోజున వార్డు సభ్యులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజున కేవలం 175 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజున భారీగా 864 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 236 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు అయ్యాయి. బాలానగర్ నుంచి 231, భూత్పూర్ 155, మూసాపేట 126, అడ్డాకుల 116 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.

News December 5, 2025

MBNR: స్థానిక ఎన్నికలు.. భారీగా నామినేషన్లు

image

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ రెండో రోజున నామినేషన్లు భారీగా దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 81 నామినేషన్లు వచ్చాయి. బాలానగర్ మండలంలో 68 నామినేషన్లు, భూత్పూర్ మండలంలో 44 నామినేషన్లు, మూసాపేట మండలంలో 19 నామినేషన్లు, అడ్డాకులలో 37 నామినేషన్లు దాఖలయ్యాయి.