News February 26, 2026

మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్త

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్‌గా సేవలందించిన విజయేందిర బదిలీ కావడంతో, ప్రభుత్వం ఖుష్బూ గుప్తకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. గతంలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేసిన ఆమె, జిల్లా అభివృద్ధిపై తనదైన ముద్ర వేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Similar News

News April 18, 2026

జడ్చర్ల: సురేశ్ మృతిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

image

జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిమ్లాగాని తండాకు చెందిన కాట్రావత్ సురేష్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ శనివారం పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

MBNR: అక్కడ.. 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గండీడ్ మండలం సల్కర్‌పేట 43.6, దేవరకద్ర 43.1, కోయిలకొండ మండలం పారుపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.9, మేడ్చల్ మండలం దోనూరు కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 42.5, అడ్డాకుల 42.4, మహమ్మదాబాద్ 42.3, MBNR (U/R) 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.