News March 20, 2025
మహబూబ్‌నగర్: చెత్త కుప్పలో మగ్గుతోన్న బాల్యం..!

దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెబుతున్నా ఇంకా పేదల జీవితంలో మార్పు రావడం లేదు. కడుపు నింపుకునేందుకు ఆ తల్లిదండ్రులు పిల్లలను ఇటుక బట్టీలకు, చెత్త కుప్పల్లో ఏరుకునేందుకు పంపిస్తున్నారు. ఇలాంటి పేదలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బాల కార్మికులపై, పేదలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 25, 2025
ఇక పోలీసుల గుప్పిట్లో కర్రె గుట్టలు..!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ను వేరు చేస్తూ ఇప్పటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న కర్రెగుట్టలు పోలీసులకు అడ్డాగా మారనున్నాయి. ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు పార్టీ మనుగడ సాగించలేని పరిస్థితికి చేరుకుంది. రెండు రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తాజాగా ఏర్పాటైన బేస్ క్యాంపుతో ఒకప్పటి మావోయిస్టుల స్థావరం పోలీసుల వశమైంది. త్వరలో గుట్టపైన క్యాంపులు ఏర్పాటు కానున్నాయి.
News November 25, 2025
ICAR-IIMRలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

HYDలోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌లో 5 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc(జెనిటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, లైఫ్ సైన్స్, ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ ), PhD, PG( అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://www.millets.res.in/
News November 25, 2025
WGL: నిన్నటి లాగే స్థిరంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర స్థిరంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా మంగళవారం సైతం అదే ధర పలికింది. రెండు వారాల క్రితం రూ.7 వేలు మార్కు దాటిన పత్తి ధర క్రమంగా తగ్గుతుండడంతో అన్నదాతలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.


