News January 5, 2025
మహబూబ్‌నగర్ జిల్లాలో వార్తలు ఇవే.. డోంట్ మిస్
❤️పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కాలేజీ భవనాల నిర్మాణం చేపట్టండి: యెన్నం శ్రీనివాస్ రెడ్డి.❤️తెలంగాణ హైకోర్టు విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ నోటిఫికేషన్‌లో తీవ్ర అన్యాయం: మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సహదేవుడు.❤️డిండి లిఫ్ట్ నుంచి రోజుకు నుంచి టీఎంసీలు నీటిని తరలించడం తగదు: మాజీ మంత్రి నాగం ❤️పెద్దమందడి చెందిన పెంటయ్య(52) ఏపీలో అనంతపురంలో రైలు ఢీ, మృతి
Similar News
News January 18, 2025
MBNR: ప్రేమను ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య
మహ్మదాబాద్ మండలం ధర్మాపూర్‌కు చెందిన పెద్దలు యువతి ప్రేమను కాదన్నారని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. MBNRలోని ఓ కళాశాలలో నర్సింగ్ చదువుతున్న గ్రామానికి చెందిన నవనీత(19) ఓ యువకుడిని ప్రేమించింది. విషయం తెలిసి యువతి ఇంట్లో వారు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News January 18, 2025
MBNR: ఇంటర్ బోర్డు నిఘాలో ప్రయోగ పరీక్షలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే నెల 3 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల పర్యవేక్షణకు హైదరాబాదులోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో కమాండ్, కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తామని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 22 వరకు కొనసాగుతాయని అధికారులు వివరించారు.
News January 18, 2025
MBNR: ఇబ్బందులకు గురి చేసే అధికారులను ఉపేక్షించం: మంత్రి జూపల్లి
ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఉపేక్షించబోమని మంత్రి జూపల్లికృష్ణారావు హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి పెంట్లవెల్లికి వచ్చిన మంత్రికి రెవెన్యూ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు, నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో సంబంధిత అధికారులు స్పందించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు.