News March 20, 2025
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్ సరఫరా, పంటల విస్తీర్ణం తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. చెరువులు, కుంటలు కబ్జా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News April 22, 2025
నారాయణపేట: బాలికపై యువకుడి అత్యాచారం

NRPT జిల్లా మద్దూరులో బాలికపై అత్యాచారం జరిగింది. కోస్గి సీఐ సైదులు తెలిపిన వివరాలు.. దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) మద్దూరులో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. దామరగిద్ద వాసి బోయిని శ్రీనివాస్(24) ఈనెల 10న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్పై HYDకు తీసుకెళ్లి ఓ కిరాయి రూంలో అత్యాచారం చేసి, తెల్లారి మద్దూరు బస్టాండ్లో వదిలేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News April 22, 2025
నేడే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్లో 10,922 సెకండియర్లో 11,561 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం నేటితో తేలనుంది. ఇంటర్మీడియట్ ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.- ALL THE BEST
News April 22, 2025
నాగర్కర్నూల్: రంపంతో భర్త గొంతు కోసిన భార్య..!

నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వెంకటేశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. అవుసలికుంటలో కురుమయ్య, చెన్నమ్మ దంపతులు ఉంటున్నారు. ఈనెల 19న భార్యతో కురుమయ్య గొడవపడ్డాడు. అదేరోజు రా.11 గంటలకు భర్త నిద్రిస్తుండగా చెన్నమ్మ కోపంతో వెళ్లి రంపం బ్లేడ్ తీసుకొచ్చి కురుమయ్య గొంతు కోసింది. అతడు అరవగా పక్కింట్లో ఉన్న బంధువులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదైంది.