News April 4, 2025
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల బీఎస్పీ ముఖ్య నేతల సమావేశం

బహుజన సమాజ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శుక్రవారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇబ్రహీం శేఖర్ హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఆర్థికంగా సామాజికంగా ఎదిగి ఇతరులకు సహాయపడాలని, సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను రాజ్యాంగ బద్ధంగా ప్రశ్నించాలన్నారు.
Similar News
News December 16, 2025
జగిత్యాల: 3వ విడతలో మంత్రి, మాజీ మంత్రుల మధ్యనే పోటీ

జగిత్యాల జిల్లాలో 3విడత పంచాయతీ ఎన్నికలు ధర్మపురి నియోజకవర్గ పరిధిలోనే జరగనున్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇరువురికి చెందిన అభ్యర్థుల మధ్య గట్టిపోటీ నెలకొంది. తన సత్తాచాటేందుకు ఒకవైపు మంత్రి అడ్డూరి ప్రచారం చేయగా, మరోవైపు మాజీమంత్రి ఈశ్వర్ కూడ తన క్యాడర్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరిది పై చేయిగా ఉంటుందో బుధవారం తేలనుంది.
News December 16, 2025
గాంధీజీ పేరును తొలగించడం దురదృష్టకరం: శశిథరూర్

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. దీన్ని ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవక మిషన్ (గ్రామీణ్)’ (VBGRAMG) అని పేర్కొంది. అయితే దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాంధీజీ పేరును తొలగించడం దురదృష్టకరమని, మహాత్ముడిని అగౌరవపరచొద్దని కాంగ్రెస్ MP శశి థరూర్ కోరారు.
News December 16, 2025
డిసెంబర్ 16: చరిత్రలో ఈరోజు

* 1912: సినీ దర్శకుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు జననం
* 1949: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి జననం
* 1951: సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభం
* 1971: ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటు
* విజయ్ దివస్ (1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం)


