News April 4, 2025

మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల బీఎస్పీ ముఖ్య నేతల సమావేశం

image

బహుజన సమాజ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శుక్రవారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇబ్రహీం శేఖర్ హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఆర్థికంగా సామాజికంగా ఎదిగి ఇతరులకు సహాయపడాలని, సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను రాజ్యాంగ బద్ధంగా ప్రశ్నించాలన్నారు. 

Similar News

News December 6, 2025

NLG జిల్లాలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిసి., ఇబిసి, ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు Awareness programme, IELTS కొరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎస్పీ రాజ్ కుమార్ తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. website:tgbcstudycircle.cgg.gov.in నందు అన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.

News December 6, 2025

తొర్రూరు: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి

image

స్థానిక ఎన్నికల తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తొర్రూరు మండలం మడిపల్లికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ అభ్యర్థి వేల్పుల వెంకన్న బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అనంతరం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

News December 6, 2025

‘X’కు $140 మిలియన్ డాలర్ల ఫైన్

image

యూరోపియన్ యూనియన్ ‘X’ అధినేత ఎలాన్ మస్క్‌కు షాకిచ్చింది. తమ దేశంలోని ఆన్‌లైన్ కంటెంట్ రూల్స్‌ను మస్క్ ప్లాట్‌ఫామ్ ఉల్లంఘించిందని EU టెక్ రెగ్యులేటర్స్ ఆరోపించింది. అందుకు 120($140 మిలియన్స్) మిలియన్ యూరోస్ ఫైన్ విధించింది. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖండించారు. “ఇది కేవలం ‘X’ మీదే కాదు అమెరికా టెక్ ప్లాట్‌ఫామ్స్, US పౌరులపై విదేశీ ప్రభుత్వాల దాడి” అని ట్వీట్ చేశారు.