News April 4, 2025
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల బీఎస్పీ ముఖ్య నేతల సమావేశం

బహుజన సమాజ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శుక్రవారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇబ్రహీం శేఖర్ హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఆర్థికంగా సామాజికంగా ఎదిగి ఇతరులకు సహాయపడాలని, సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను రాజ్యాంగ బద్ధంగా ప్రశ్నించాలన్నారు.
Similar News
News April 20, 2025
ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 21న(సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ దృష్ట్యా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కావు,న జిల్లాకు చెందిన ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.
News April 20, 2025
గుజరాత్‌లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ

AP: మంత్రి నారాయణ బృందం ఇవాళ అహ్మదాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ఏక్తానగర్‌కు మంత్రి బస్సులో ప్రయాణించారు. ఏక్తానగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. విగ్రహ నిర్మాణానికి సంబంధించిన వివరాలు, ప్రత్యేకతలు అక్కడి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో భారీ విగ్రహాల నిర్మాణం కోసం పటేల్ విగ్రహ నిర్మాణ తీరును మంత్రి బృందం అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది.
News April 20, 2025
కొత్తగూడెం: ఇళ్ల తప్పుడు లెక్కలు.. ఉద్యోగి సస్పెండ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్తగూడెం జిల్లాలో అవకతవకలు వెలుగుచూశాయి. భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో 18 మంది లబ్ధిదారులకు సంబంధించి, విధుల్లో ఉన్న వ్యక్తి బేస్‌మెంట్ స్థాయి నిర్మాణం పూర్తికానప్పటికీ, తప్పుడు వివరాలు నమోదు చేశారని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతణ్ని విధుల నుంచి తొలగించారు. అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని కలెక్టర్ స్పష్టంచేశారు.