News April 4, 2025
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల బీఎస్పీ ముఖ్య నేతల సమావేశం

బహుజన సమాజ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శుక్రవారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇబ్రహీం శేఖర్ హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఆర్థికంగా సామాజికంగా ఎదిగి ఇతరులకు సహాయపడాలని, సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను రాజ్యాంగ బద్ధంగా ప్రశ్నించాలన్నారు.
Similar News
News July 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 6, 2025
NZB: VRకు ఏడుగురు SI

బాసర జోన్ పరిధిలో 14 మంది ఎస్ఐలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏడుగురిని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరికొండ SHO రాము, మోపాల్ SHO యాదగిరి, ఎడపల్లి SHO వంశీ కృష్ణ, మెండోరా SHO యాసిర్ అరాఫత్, ఏర్గట్ల SHO రామును నిజామాబాద్ VRకు పంపించారు. బాల్కొండ SHO నరేశ్, మోర్తాడ్ SHO విక్రమ్‌ను ఆదిలాబాద్ VRకు అటాచ్ చేశారు.
News July 6, 2025
జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

AP: సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రంలోని జడ్జీలందరికీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘SM పోస్టుల కేసుల్లో ఆర్నేష్ కుమార్ Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు తీర్పులో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడంలేదు. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ(3-ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో)పై FIRలు నమోదుకు ముందు కచ్చితంగా విచారణ జరగాలి. 14 రోజుల్లోగా విచారణ చేయాలి, అందుకు DSP అనుమతి పొందాలి’ అని స్పష్టం చేసింది.