News October 21, 2024

మహబూబ్‌నగర్ : నేటి నుంచి 28 వరకు SA-1 పరీక్షలు

image

ఉమ్మడి MBNR జిల్లాలో సంగ్రహణాత్మక మూల్యాంకనం (SA)-1 పరీక్షలు ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు (DCEB) ఆధ్వర్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 4,180 పాఠశాలల్లోని 1-10 తరగతులకు చెందని సుమారు 5,42,530 మంది విద్యార్థులు  పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.

Similar News

News September 18, 2025

MBNR: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ జానకి

image

అధికారుల పేరుతో నగదు కోరే మెసేజీల పట్ల ప్రజలు మోసపోవద్దని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. ఇటీవల జిల్లాలో పలువురు సైబర్ నేరగాళ్ల పన్నాగాలకు గురవుతున్నారని, అధికారులు వ్యక్తిగత ఖాతాలకు డబ్బు పంపమని అడగరని ఆమె తెలిపారు. ఇటువంటి మెసేజీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు.

News September 17, 2025

MBNR: బిచ్చగాడిని హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

image

దేవరకద్ర బస్ స్టాండ్ సమీపంలో బిచ్చగాడిని రాళ్లతో కొట్టి హత్య చేసిన కేసులో మహబూబ్‌నగర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు వెంకటేష్‌కు న్యాయమూర్తి వి.శారదా దేవి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ కేసు విచారణలో శ్రమించిన సీఐ రామకృష్ణ, డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News September 16, 2025

MBNR: SP సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

image

MBNRలోని పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ రోజు నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి అధికారులకు కీలక సూచనలు చేశారు.
✒CC కెమెరాల నిఘా పెంచి, పని చేయని కెమెరాలను వెంటనే రిపేర్ చేయాలి.
✒పెండింగ్‌లో ఉన్న అరెస్టులు, FSL రిపోర్టులు పూర్తి చేయాలి.
✒ప్రజావాణి.. వెంటనే చర్యలు తీసుకోవాలి.
✒POCSO కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
✒వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.