News May 12, 2024
మహబూబ్నగర్: పదండి.. సగర్వంగా ఓటేద్దాం..!

ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఓటరు చైతన్యం కోసం వినూత్న ప్రచారం చేసిన ఈసీ రెండు రోజులుగా మెసేజ్లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. పదండి.. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. దేశం కోసం మీ వంతు బాధ్యత మర్చిపోకండి. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’. పనులుంటే వాయిదా వేసుకోండి. సాకులు చెప్పకుండా రేపు ఓటు వేయండి’ అంటూ సందేశానిస్తుంది.
-GO VOTE.
Similar News
News September 18, 2025
WOW వన్డే లీగ్.. బౌలింగ్లో సత్తా చాటిన గద్వాల కుర్రాడు

HYDలోని KCR-2 మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్డే క్రికెట్ లీగ్ టోర్నీలో గద్వాల్ జట్టు కుర్రాడు వెంకట్ సాగర్ బౌలింగ్ లో సత్తా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల్ జట్టు 44.4 ఓవర్లలో 332/10 పరుగులు చేయగా.. HYD జట్టు కేవలం 20.3 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది. 9 వికెట్లు తీసిన గద్వాల్ జట్టు క్రీడాకారుడు వెంకట్ సాగర్కు కోచ్ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.
News September 18, 2025
MBNR: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ జానకి

అధికారుల పేరుతో నగదు కోరే మెసేజీల పట్ల ప్రజలు మోసపోవద్దని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. ఇటీవల జిల్లాలో పలువురు సైబర్ నేరగాళ్ల పన్నాగాలకు గురవుతున్నారని, అధికారులు వ్యక్తిగత ఖాతాలకు డబ్బు పంపమని అడగరని ఆమె తెలిపారు. ఇటువంటి మెసేజీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు.
News September 17, 2025
MBNR: బిచ్చగాడిని హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

దేవరకద్ర బస్ స్టాండ్ సమీపంలో బిచ్చగాడిని రాళ్లతో కొట్టి హత్య చేసిన కేసులో మహబూబ్నగర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు వెంకటేష్కు న్యాయమూర్తి వి.శారదా దేవి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ కేసు విచారణలో శ్రమించిన సీఐ రామకృష్ణ, డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.