News May 25, 2024
మహబూబ్నగర్ పార్లమెంట్లో గెలుపెవరిది..?

పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత MBNR పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపుపై కాంగ్రెస్, BJP, BRS పార్టీల నేతలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ MLAలు ఉండడంతో తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దేశంలో ప్రధాని మోదీ అందించిన సంక్షేమ పథకాలతో తమ గెలుపు ఖాయమని BJP నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో BRS నామమాత్రంగానే బరిలోకి దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News November 26, 2025
MBNR: పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ రోజు రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ.. దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలపై ముఖ్యమైన బాధ్యతలు కూడా ఉంచిందని, పోలీసు శాఖ ప్రజల హక్కులను కాపాడుతూ, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సేవలందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
News November 26, 2025
మహబూబ్నగర్: మొదటి విడత ఎన్నికలు జరిగేవి ఇక్కడే

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతే తెలిసింది. జిల్లాలో మొదటి విడతలో 139 గ్రామపంచాయతీలకు, 1188 వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఎలక్షన్ జరగనున్నాయి. జిల్లాలో మొదటి విడతలో రాజాపూర్, మహబూబ్ నగర్, నవాబుపేట, గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో ఎలక్షన్ జరగనున్నాయి. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.