News April 9, 2025
మహబూబ్నగర్: పెరుగుతున్న ఎండల తీవ్రత

మహబూబ్నగర్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం కౌకుంట్ల మండలంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ప్రతాపానికి ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మే నెలలో ఇంకా ఎంత ఎండ ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు నిమ్మరసం, పండ్ల రసాలు, జ్యూస్ వంటి శీతల పానీయాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారని తెలిపారు.
Similar News
News October 29, 2025
MBNRలో భారీ వర్షం..ఈ మెసేజ్ వచ్చిందా?

ఉమ్మడి జిల్లాలోని MBNR, GDWL, WNPT,NRPT జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్లు పంపింది. మీకూ వచ్చాయా?
News October 29, 2025
MBNR: నూతన ఇంజనీరింగ్ కళాశాల..100% అడ్మిషన్స్:VC

పాలమూరు వర్సిటీలోని నూతనంగా ఏర్పడ్డ ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలో ఏర్పడడం సంతోషంగా ఉందని, ఇంజినీరింగ్ కళాశాలలో 100% అడ్మిషన్స్ జరిగాయని ఉపకులపతి (VC) జిఎన్ శ్రీనివాస్ అన్నారు. స్నాతకోత్సవం సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. జనవరిలో నాక్ పీర్ టీం విజిట్ చేసి బి-గ్రేడ్ ఇవ్వడం జరిగిందని, గ్రంథాలయంలో కొత్త పుస్తకాలు ఏర్పాటు చేశామని, నాన్ టీచింగ్ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
News October 29, 2025
పాలమూరుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాక

జిల్లా కేంద్రానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం రానున్నట్లు టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. టీఆర్పీ పార్టీ నాయకులకు దిశానిర్దేశం, నియామక పత్రాలు, బీసీల రిజర్వేషన్లు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ విధి విధానాలు, తీరుతెన్నులు తదితర విషయాలపై కార్యక్రమం ఉందన్నారు.


