News December 28, 2024
మహబూబ్‌నగర్ పొలిటికల్ రౌండప్ @2024
పాలమూరు జిల్లా కాంగ్రెస్‌కు 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు 12 చోట్ల గెలవడంతోపాటు కాంగ్రెస్ అధికారం చేపట్టింది. జిల్లాకు సీఎం, మంత్రి పదవితోపాటు దక్కడంతో శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. మరో వైపు BRS అల్లంపూర్, గద్వాలలో గెలవగా ప్రస్తుతం పట్టుకోసం ప్రయత్నిస్తోందంటున్నారు. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అభిప్రాయపడ్డారు.
Similar News
News February 5, 2025
బాలానగర్: ఉరేసుకుని యువకుడి సూసైడ్
ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలనగర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ యాదవ్ (23) హైదరాబాదులో ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఏం జరిగిందో కారణం తెలియదు కానీ.. తల్లి కూలీ పనులకు వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News February 5, 2025
NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి
ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
News February 5, 2025
MBNR: వివాహితపై లైంగిక దాడి
MBNR జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ తండాకు చెందిన వివాహితపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గిరిజనతండాకు చెందిన వివాహిత పొలానికెళ్లి వస్తుండగా.. శంకర్‌నాయక్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.