News August 13, 2024

మహబూబ్‌నగర్: బంద్‌కు హిందూ సంఘాల పిలుపు

image

బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్‌కు హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపునిస్తున్నాయి. సోమవారం మక్తల్‌లో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. నేడు ఉమ్మడి జిల్లాలోని మద్దూర్, కోస్గి, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, జడ్చర్ల, తదితర ప్రాంతాల్లో బంద్ చేపట్టాయి. ఉదయం నుంచే అన్ని వ్యాపార వర్గాల వారు బంద్‌కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సంఘాలు కోరుతున్నాయి.

Similar News

News February 22, 2026

పాలమూరు: సీఎం కప్ నెట్‌బాల్ ఫైనల్‌కు నారాయణపేట జట్టు

image

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రెండో రాష్ట్రస్థాయి సీఎం కప్-2026 నెట్‌బాల్ పోటీల్లో నారాయణపేట జిల్లా బాలుర జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు డా. శెట్టి రమేశ్, డా. రామ్మోహన్ గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. రేపు జరగబోయే తుది పోరులో జట్టు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.

News February 21, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒ MBNR: క్రీడలతోనే మానసిక స్థైర్యం – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
✒ MBNR:AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ
✒ నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం.. కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
✒ ఈనెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో
✒ NGKL:SLBC పనులు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒ ఇంటర్ పరీక్షలపై ప్రత్యేక ఫోకస్

News February 20, 2026

MBNR: AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ

image

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ 2025-26 నిర్వహించారు. “Creating AI & Quantum enabled Higher Educational Institutions” అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీయూ వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ కూడా పాల్గొన్నారు.