News March 19, 2025

మహబూబ్‌నగర్: ‘బీసీ బిల్లు రాజ్యాధికారానికి తొలిమెట్టు’

image

బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించడంలో బీసీ సంఘాల ముఖ్యపాత్ర ఉందని బీసీ ఐక్యవేదిక ఉద్ఘటించింది. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ MBNRలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42%రిజర్వేషన్లు ప్రకటించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 19, 2025

తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా పాలమూరు వాసి

image

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్‌గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.

News March 19, 2025

MBNR: GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాల్లో 12,300 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు.

News March 19, 2025

బాలానగర్‌: అంగన్వాడీ టీచర్ అదృశ్యం

image

ఓ అంగన్వాడీ టీచర్ అదృశ్యమైన ఘటన బాలానగర్ మండలంలోని వనమోనిగూడ గ్రామంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. లత గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. ఈనెల 16న ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదని అత్త యాదమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

error: Content is protected !!