News April 12, 2025

మహబూబ్‌నగర్: ‘భారీగా మామిడి పండ్ల ధరలు’ 

image

వేసవి కాలం నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మార్కెట్లలో మామిడి పండ్ల కొనుగోళ్లు షురూ అయ్యాయి. ప్రస్తుతం మామిడి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఒక్కో బాక్స్‌కు ధర రూ.7,000 నుంచి రూ.8,000 వరకు పలుకుతుందని చెప్పారు. రిటైల్ మార్కెట్‌లో కేజీ ధర రూ.150 నుంచి రూ.250 వరకు అమ్మడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రేట్ ఎంత ఉంది.. కామెంట్ చేయండి.

Similar News

News October 21, 2025

అనంతపురంలో ‘కె ర్యాంప్’ హీరో

image

‘కె ర్యాంప్’ సినిమా హీరో కిరణ్ అబ్బవరం సోమవారం రాత్రి అనంతపురంలో సందడి చేశారు. నగరంలోని గౌరీ థియేటర్లో ఆయన ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించారు. థియేటర్‌కు హీరో వచ్చాడన్న విషయం తెలుసుకుని అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు వేశారు. ఈ దీపావళికి సినిమా బ్లాక్ బస్టర్ అయిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

News October 21, 2025

నేడు అన్నమయ్యలో అమరవీరుల వారోత్సవాలు

image

పోలీస్ అమర వీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పిలుపు నిచ్చారు. ఈనెల 21 నుంచి 31 వరకు వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ప్రజలు, విద్యార్థులు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో దేశ రక్షణ, ప్రజల భద్రతలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ.. జిల్లాలో ర్యాలీలు, వారోత్సవాలను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

News October 21, 2025

5,800 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

రైల్వేలో 5,800 నాన్ టెక్నికల్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ అర్హతతో 18నుంచి 33ఏళ్లు గల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్ పాసైన18 నుంచి 30 ఏళ్లు గల అభ్యర్థులు ఈనెల 28 నుంచి నవంబర్ 27వరకు దరఖాస్తు చేయవచ్చు. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/