News April 12, 2025
మహబూబ్‌నగర్: ‘భారీగా మామిడి పండ్ల ధరలు’

వేసవి కాలం నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మార్కెట్లలో మామిడి పండ్ల కొనుగోళ్లు షురూ అయ్యాయి. ప్రస్తుతం మామిడి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఒక్కో బాక్స్‌కు ధర రూ.7,000 నుంచి రూ.8,000 వరకు పలుకుతుందని చెప్పారు. రిటైల్ మార్కెట్‌లో కేజీ ధర రూ.150 నుంచి రూ.250 వరకు అమ్మడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రేట్ ఎంత ఉంది.. కామెంట్ చేయండి.
Similar News
News April 20, 2025
యద్దనపూడి: భార్యను హతమార్చిన భర్త

బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భార్య నీలం మంగమ్మ (45)ను భర్త నీలం శ్రీనివాసరావు హతమార్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
VZM: మహిళ దారుణ హత్య

విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం. పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభీమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా దుండగులు చాక్‌తో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
ఏలూరు: జిల్లా వ్యాప్తంగా లాడ్జీల్లో తనిఖీలు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు లాడ్జీలను శనివారం అర్ధరాత్రి తనిఖీ చేశారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ల పరిధిలో ఆయా డీఎస్పీల ఆధ్వర్యంలో ఎస్ఐ, సీఐలు సంయుక్తంగా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా లాడ్జిలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని లాడ్జి నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సారథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి.