News March 31, 2025
మహబూబ్‌నగర్: భారీ ధర్నాకు బీసీ సంఘం: గోనెల శ్రీనివాసులు

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో అమలు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి బీసీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, మైత్రి యాదయ్య ముదిరాజ్, మురళి తదితరులున్నారు.
Similar News
News April 17, 2025
BREAKING: ఇంగ్లిష్ టీచర్ కళ్యాణి సస్పెండ్: నాగర్‌కర్నూల్ డీఈవో

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూల్ కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు కళ్యాణిని సస్పెండ్ చేస్తూ డీఈవో రమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయురాలి వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు డీఈవో ప్రకటించారు.
News April 17, 2025
MBNR: కార్మిక చట్టాలు నిర్వీర్యం: సీఐటీయూ

మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి ఏప్రిల్ 22న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి కురుమూర్తి తెలిపారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, అధిక ధరలు తగ్గించి, కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.
News April 17, 2025
భూత్పూరు: సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఆకస్మిక తనిఖీలు

జిల్లా ఎస్పీ డీ.జానకి ఆదేశాల మేరకు భూత్పూర్ మండల పరిధిలోని సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ యశ్వంత్ రావు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, నిబంధనలకు విరుద్ధంగా సీడ్ ప్రాసెసింగ్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విత్తన శుద్ధి, ప్యాకింగ్ ,గోదాముల నిర్వహణ వంటి అంశాల్లో పూర్తి సమీక్ష జరిపామని తెలిపారు.