News September 7, 2024

మహబూబ్‌నగర్: భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం

image

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్లు జలమయం అయ్యాయి. తాండూర్-మహబూబ్‌నగర్ రోడ్డుపై రాకపోకలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన కల్వర్టులపై నుంచి వరద నీరు ప్రవహించింది. శుక్రవారం రాకపోకలు అగిపోయాయి.

Similar News

News October 17, 2025

పాలమూరు యూనివర్శిటీ వీసీగా ఏడాది పూర్తి

image

పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైంది. ఈ ఏడాదిలో వర్శిటీ విద్యా, పరిపాలనా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. వీసీ బాధ్యతలు చేపట్టిన వెంటనే నాక్ (NAAC) గ్రేడింగ్‌కు వెళ్లడం, లా కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజీలను స్థాపించడం వంటి కీలక చర్యలు చేపట్టారు. ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాది 100% అడ్మిషన్లు జరిగాయి.

News October 17, 2025

కురుమూర్తి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

image

దేవరకద్ర నియోజకవర్గం కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

News October 17, 2025

‘ఏక్ పేడ్ మా కే నామ్’.. విస్తరించండి: గవర్నర్

image

విద్యార్థులు ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలి పీయూ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. పీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదాన వేడుక మాత్రమే కాదు, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని’ సూచించారు.